AICC అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ.. మంత్రి కేటీఆర్ సెటైర్లు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. AICC అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని మంత్రి సెటైర్లు వేశారు.
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. AICC అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని మంత్రి సెటైర్లు వేశారు. ఇక BJP అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ అని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో దేశాన్ని దోచుకున్న తోడు దొంగలు కాంగ్రెస్, బీజేపీ అని అన్నారు. ఈ రెండు పార్టీలు అసమర్థ పాలనకు కేరాఫ్, అవినీతి ప్రభుత్వాలకు చిరునామా అని పేర్కొన్నారు. ఈ పార్టీలపాలనా వైఫల్యాల పాపమే దేశానికి, రాష్ట్రానికి శాపమై ఇంకా వెంటాడుతూ ఉందని చెప్పారు.
తమని నేరుగా ఢీకొనే దమ్ములేక MIM భుజంపై తుపాకీపెట్టి BRSను కాల్చే కుట్ర బీజేపీ చేస్తోందన్న మంత్రి.. BJP భుజంపై తుపాకీపెట్టి BRS ను కాల్చే కుతంత్రం కాంగ్రెస్ చేస్తోందని అన్నారు. వెన్నుపోటు వారసుడిని నమ్ముకుని వెన్నుముక లేని పార్టీగా మిగిలిపోయిన పార్టీ కాంగ్రెస్ అని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా..BRS అంటేనే భారత రైతు సమితి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే అంతా అంధాకార్ అని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.
75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో..
— KTR (@KTRBRS) August 12, 2023
దేశాన్ని దోచుకున్న తోడు దొంగలే – కాంగ్రెస్, బీజేపీ
AICC అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటి
BJP అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ
మీ పార్టీలే...
అసమర్థ పాలనకు కేరాఫ్..
అవినీతి ప్రభుత్వాలకు చిరునామా..
మీ దశాబ్దాల..
పాలనా వైఫల్యాల పాపమే
దేశానికి,…