రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా.. కేంద్రంపై మంత్రి కేటీఆర్ సీరియస్ (వీడియో)
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను అరెస్టు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు రెజ్లర్లకు మద్దతు ప్రకటిస్తూ ఆదివారం అర్థరాత్రి ట్వీట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను అరెస్టు చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు రెజ్లర్లకు మద్దతు ప్రకటిస్తూ ఆదివారం అర్థరాత్రి ట్వీట్ చేశారు. రెజర్లపై ఢిల్లీ పోలీసుల తీరును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రెజ్లర్ల పట్ల ఈ విధంగా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో కేంద్ర మంత్రులు ఎవరైనా వివరణ ఇవ్వగలరా అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతర్జాతీయ వేదికపై దేశ ఖ్యాతిని చాటిన రెజర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. రెజర్లకు దేశ ప్రజలు మద్దతుగా నిలవాలని...వారికి మనందరం గౌరవం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. కాగా, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లను నూతన పార్లమెంట్ ముందు మహా పంచాయత్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Read more:
ఎంత చెప్పినా వినకుండా రెజ్లర్లు చట్టాన్ని ఉల్లంఘించారు: ఢిల్లీ పోలీసులు