సహాయక చర్యలు ముమ్మరం చేయండి.. ఎలాంటి సహాయానికైనా సర్కార్ సిద్ధం: KTR

రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం స్పందించారు.

Update: 2023-07-29 09:11 GMT

దిశ, సిటీ బ్యూరో: రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు మున్సిపల్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం స్పందించారు. పురపాలక శాఖ కార్యాలయం నుంచి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో, సహాయక చర్యలు చేపట్టిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ఫస్ట్ ప్రాధాన్యతగా గుర్తించి విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇంకా వరదలు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా అంటూ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాలే ప్రధాన అంశంగా టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్సులో చర్చించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామని అధికారులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎలాంటి సహాయ సహకారాలు అయినా సూచనలు, అవసరమైన ఆదేశాల కోసం తన కార్యాలయంతో పాటు పురపాలక శాఖ కార్యాలయం ఉన్నత అధికారులు రౌండ్ అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

సహాయక చర్యలు ముమ్మరం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే తాము అన్ని సంస్థల అధికారులు, సిబ్బందికి సెలవులను ఇప్పటికే రద్దు చేశామన్నారు. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయని, వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి, అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటి నుంచి దిగువకు ప్రమాద నివారణ చర్యలు చేపడుతూ నీటిని విడుదల చేయాలన్నారు. అవసరమైన చోట లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

సహాయ కార్యక్రమాల సమన్వయం కోసం హైదరాబాద్‌తో పాటు ప్రతి జిల్లాలోని కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టణాల్లో ముఖ్యంగా ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని, అదనపు వాహనాలను సమకూర్చుకోవాలని, బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్, దోమల నివారణ మందుల స్ప్రే కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో ఉన్న బస్తీ దావకానాలు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థల సహకారంతో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులను ఏర్పాటుకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

 Also Read... ప్రజల ప్రాణాలంటే కేసీఆర్, కేటీఆర్‌కు పుల్లతో సమానం: రేవంత్ రెడ్డి ఫైర్  

Tags:    

Similar News