విభజన చట్టం హామీలు విస్మరించిన మోడీ.. కేటీఆర్
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ ప్రభుత్వం ఉల్లంఘిస్తొందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం హామీలను మోదీ ప్రభుత్వం ఉల్లంఘిస్తొందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా గుజరాత్ లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి రూ. 20 వేల కోట్లు కేటాయించడంపై గురువారం కేటీఆర్ ట్వీట్ చేశారు. విభజన చట్టంలోని హామీలను మోదీ అమలు చేయట్లేదని, ఇందుకు రాష్ట్రంలోని వెన్నెముక లేని నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలన్నారు. తొమ్మిదేండ్లుగా అడిగితే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వటం లేదని, కానీ గుజరాత్‌లోని లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి రూ.20 వేల కోట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితం ఇది అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.