Susmita Patel : అది రేవ్ పార్టీ కాదు.. ఎలాంటి అక్రమ పదార్ధాలు లేవు: మంత్రి కొండా సురేఖ కూతురు

మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నటుడు నాగార్జున ఫ్యామిలీ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదంగా మారిన విషయం తెలిసిందే.

Update: 2024-11-22 07:38 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల నటుడు నాగార్జున ఫ్యామిలీ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో వివాదంగా మారిన విషయం తెలిసిందే. అదేవిధంగా కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ కావడంతో వార్తల్లో నిలిచారు. తాజాగా మరోసారి ఆమె మాట్లాడిన వీడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అందులో కూతురు (Sushmita Patel)తో మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. ఈ రోజు మా అందరికీ పండుగ ఉంది.. బిర్యానీలు తెప్పిస్తున్నాం. చిన్న పాప పేరుతోటి. మా టీమ్ అంతా కూడా ఇవాళ ఫుల్ ఎంజాయ్. బిర్యానీ ఉంటే బీర్ ఉంటది కదమ్మా పాపం. అఫీషియల్ సెలబ్రేషన్స్ అంటే అఫీషియల్‌గా ఇచ్చేది. ఇక అన్ అఫీషియల్‌గా అంటే.. అని అన్నారు. అదేవిధంగా మరో వీడియోలో ఎవరు ఎక్కువ డ్యాన్స్‌ చేస్తే వాళ్లకు మందు ఎక్కువ అని మంత్రి చెప్ప‌డం ఉంటుంది. మందు ఎరులైపారుతుంది. అక్కడ వరంగల్ లో కొండా మురళి మందు ఏరులై పారిస్తున్నారు. ఇక్కడ కొండా సురేఖ పారిస్తున్నారు.. అని కూతురు సుష్మిత పటేల్ వీడియోలో అంటారు.

ఇంట్లో బీర్లు, బిర్యానీల పార్టీ అంటూ నెట్టింట వీడియో వైరల్ అయింది. దేవాదాయ శాఖ మంత్రి.. ఇలాంటి పార్టీ చేసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీకి పర్మిషన్‌ ఉందా? మందు పార్టీనా? రేవ్ పార్టీనా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోపై శుక్రవారం మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ (Konda Sushmita Patel) ఒక ప్రకటన విడుదల చేశారు. అది రేవ్ పార్టీ కాదిని, ఫ్యామిలీ పార్టీ అని క్లారిటీ ఇచ్చారు. (కొండా సురేఖ మనవరాలు) తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా మా అమ్మ తన స్టాఫ్‌కి దావత్ ఇచ్చిందని, పార్టీలో లిక్కర్ కూడా ఉందని తెలిపారు. ఇది ఫ్యామిలీ పార్టీ సెలబ్రేషన్స్ అని, ఈ కార్యక్రమంలో ఎలాంటి అక్రమ పదార్థాలు కానీ, అక్రమ పూరితమైన మద్యం కానీ లేదు.. బహిరంగగా ఏర్పాటు చేసినదే.. కావున కొందరు కుట్రపూరీతంగా చేస్తున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా.. అంటూ పేర్కొంది.

Tags:    

Similar News