రూ.2లక్షల రుణమాఫీకి డెడ్‌లైన్ ఫిక్స్.. దేవుడి సాక్షిగా చెప్పిన మంత్రి కోమటిరెడ్డి

రూ.2 లక్షల రైతు రుణమాఫీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఆయన ఓ

Update: 2024-07-04 12:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: రూ.2 లక్షల రైతు రుణమాఫీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం యాదాద్రి జిల్లాలో పర్యటించిన ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెబుతున్నా.. పంద్రాగస్ట్‌లోపు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తున్న ఏకైక సీఎం రేవంత్ ఒక్కడేనని కొనియాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులతో రాష్ట్రాన్ని దుబారా చేసిందని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలు పదేళ్ల పాటు రాష్ట్ర వనరులను దోచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోకి తీసుకొస్తు్న్నామన్నారు. యాదాద్రి గురించి మాట్లాడుతూ.. ఇకపై యాదాద్రి కాదని.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామని అని క్లారిటీ ఇచ్చారు. కాగా, అధికారంలోకి వస్తే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ పవర్‌లోకి హస్తం పార్టీ.. హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీపై కసరత్తు మొదలుపెట్టింది. ఆగస్ట్ 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పగా.. తాజాగా మంత్రి కోమటిరెడ్డి సైతం అదే విషయం చెప్పారు.


Similar News