Breaking: గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి.. కేవ్ క్లబ్‌పై దాడుల్లో సంచలన విషయాలు

డ్రగ్స్, గంజాయిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా ఇంకా కలకలం రేగుతోంది..

Update: 2024-07-07 04:59 GMT

దిశ, వెబ్ డెస్క్: డ్రగ్స్, గంజాయిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తు్న్నారు. అనుమానం వచ్చిన అన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. నగర శివారులో వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయినా సరే అక్రమార్కులు వక్రమార్గంలో గంజాయిని ట్విన్ సిటీకి రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి హైదరాబాద్‌కు తెప్పిస్తున్నారు. క్లబ్బులు, ప్లబ్బులకు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు.

తాజాగా భాగ్యనగరంలో అర్ధరాత్రి డ్రగ్స్ కలకలం రేగింది. కేవ్ క్లబ్‌పై నార్కొటిక్ బ్యూరో చేసిన దాడుల్లో కొకైన్ తీసుకుంటుూ డీజే గౌరవ్ పట్టుబడ్డారు. అంతేకాదు క్లబ్‌లో ఉన్న 55 మందికి టెస్టులు నిర్వహించడంతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 24 మంది గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించారు. గోవా నుంచి సైకడిక్ డ్రగ్స్ దిగుమతి చేసినట్లు అధికారులు నిర్ధరించారు. డ్రగ్స్ వినియోగదారులు డీజే గౌరవ్‌‌తో టచ్ ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ కోసం వినియోగదారులు ఛాటింగ్‌లో కోడ్ లాంగ్వేజ్‌ ఉపయోగించినట్లు తేలింది. దీంతో క్లబ్ నిర్మాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీజే గౌరవ్‌తో ఉన్న ప్రముఖుల సంబంధాలపై విచారణ జరుపుతున్నారు.


Similar News