ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-07-07 03:56 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే తర్ణం వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జైనథ్ మండలం తరోడా దగ్గర వరద ఉధృతికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మహారాష్ట్ర, ఆదిలాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలను వాగులు, వంకల వద్దకు వెళ్లనీయకుండా పోలీసులతో హెచ్చరికలు జారీ చేశారు.


Similar News