విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నాం: కోమటిరెడ్డి
ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలనపై అధికారులు ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజాపాలనపై అధికారులు ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వ పథకాలు అందించాలనేదే తమ ప్రయత్నమని చెప్పారు. పదేళ్లుగా విధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడుతున్నామని అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మించినా ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేకపోయారని బీఆర్ఎస్ నేతలపై అసహనం వ్యక్తం చేశారు.
400 ఎకరాల ఫాంహౌజ్ కోసమే కేసీఆర్ పనిచేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. డిండి ప్రాజెక్టుల పేరుతో భూములు లాక్కున్నారని గుర్తుచేశారు. తప్పకుండా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగబోతోందని అన్నారు. ధరణిలోని లోపాలను కూడా సరిచేస్తామని హామీ ఇచ్చారు. ధరణి పేరుతో ఆక్రమించుకున్న భూములను బయటకు తీస్తామని చెప్పారు.