ఆఫీస్‌కి టైంకి రారా..? అంతా మీ ఇష్టమేనా..? అధికారకులపై మంత్రి జూపల్లి ఫైర్
ఆఫీస్‌కి టైంకి రారా..? అంతా మీ ఇష్టమేనా..? అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. గురువారం పర్యాటక భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆఫీస్‌కి టైంకి రారా..? అంతా మీ ఇష్టమేనా..? అధికారులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. గురువారం పర్యాటక భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టిక, బయో మెట్రిక్‌లో అటెండెన్స్ పరిశీలించారు. ఆఫీస్ టైమింగ్స్ పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలోనే భవన్‌లోని ప్రతీ ప్లోర్ ను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివరాలను మంత్రి జూపల్లి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు.
దీంతో ఉద్యోగులు పనితీరు, హాజరు శాతంపై సమీక్ష నిర్వహిస్తాని చెప్పారు. ఉద్యోగుల గత 12 నెలల హాజరు వివరాలు ఇవ్వాలని వెల్లడించారు. మరోవైపు ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.