రాహుల్ గాంధీ లీడర్ కాదు.. రాసిచ్చింది చదివే రీడర్: మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం సభలో రాహుల్ బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-07-03 06:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మం సభలో రాహుల్ బీఆర్ఎస్‌పై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లీడర్ కాదు.. ఆయనొక రీడర్.. ఎవరో రాసిచ్చింది చడవడమే ఆయన చేస్తున్న పని అని ఎద్దేవా చేశారు. నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఖమ్మం సభలో మాట్లాడారన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ రిశ్తేదార్ కాదని.. రాహులే మోడీకి గుత్తేదారని ధ్వజమెత్తారు.

రెండు సార్లూ ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టిన రాహుల్ గాంధీ.. నాలుగువేల ఫించన్ ఏ హోదాలో ప్రకటించారని నిలదీశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంత అని ప్రశ్నించారు. తెలంగాణలో నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జనగర్జన సభలో ఫించన్ ప్లకార్డులు రాహుల్ తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీని కోనఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్‌లో వృద్దులకు ఇచ్చే ఫించన్ 350 రూపాయలే.. అదే రాష్ట్రంలో వికలాంగులకు 500, వితంతువులకు ఇచ్చేది 350 రూపాయలే అని అన్నారు.

సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటకలోనూ వృద్దులకు 800, విజలాంగులకు 800, వితంతువులకు 800 రూపాయలే ఫించన్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వినిపించారని అన్నారు. అందుకే ఆయనను లీడర్‌గా కాకుండా రీడర్ గానే చూడాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని రూ. 4000 ఫించన్ తెలంగాణాలో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో అయితే.. కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసిందని విమర్శించారు. కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుందని ఫైర్ అయ్యారు.

Read More:  రాహుల్ ఏ హోదాలో హామీ ఇచ్చారు?: మంత్రులు పువ్వాడ, ప్రశాంత్ రెడ్డి 

Tags:    

Similar News