దిశ, మునుగోడు: రాష్ట్రంలోని ఆడబిడ్డల వివాహాలకు తల్లిదండ్రులు అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారని, ఎలాగైనా వారికి ఆడబిడ్డల పెళ్లి కష్టంగా మారకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడబిడ్డల పెళ్ళికి తెచ్చిన అప్పులు తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారి అప్పు తీర్చడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ముందుగా మండల కేంద్రంలో లబ్దిదారులకు ఇళ్లకు వెళ్లి చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం స్థానిక ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మంజూరైన లాప్‌టాప్‌లు, బ్యాటరీ వీల్ చైర్లు, మోటోరైజ్డ్ వెహికిల్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ సంఘం చైర్మన్, మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి రవి ముదిరాజ్, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, ఆర్డీఓ జగదీష్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, పీడీ సుభద్ర, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో యాకూబ్ నాయక్, వైస్ ఎంపీపీ అనంత వీణస్వామి గౌడ్, సీడీపీఓ కవిత, సర్పంచులు గుర్రం సత్యం, మిర్యాల వెంకన్న, కంచి జ్యోతి ప్రసాద్, కొల్లూరి పద్మ, చోల్లేడు ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య, నాయకులు బండ పురుషోత్తం రెడ్డి, మందుల సత్యం, కందుల రాజు, కరుణాకర్ పాల్గొన్నారు.