నాటి పరిస్థితులకు సజీవ సాక్ష్యం నాణేలు, శాసనాలు.. మంత్రి హరీష్ రావు

నాటి పరిస్థితులకు సజీవ సాక్ష్యం శాసనాలు అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Update: 2023-02-18 15:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మత పరిస్థితులకు నాణేలు, శాసనాలు అద్దం పడతాయని, నాటి పరిస్థితులకు సజీవ సాక్ష్యంగా నిలుస్తాయని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఘనమైన చరిత్రకు నిజమైన ఆధారాలుగా నిలిచి చరిత్రను పునర్‌ లిఖించేందుకు దోహదం చేస్తాయన్నారు. బంజారాహిల్స్ లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో శనివారం డాక్టర్ రాజారెడ్డి రచించిన కాకతీయ కాయిన్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రచనలు, నాణేలు, శాసనాలు మాత్రమే కాదు, కాకతీయుల పాలనకు ఇప్పటికీ అనేక సాక్ష్యాలు మన కళ్లముందు సాక్ష్యాలుగా ఉన్నాయన్నారు.

తెలంగాణ ప్రాంతంలో సాగుభూమిని, నీటి వనరులను పెంచడానికి కాకతీయులు ఆనాడే ఎనలేని కృషి చేశారన్నారు. కాకతీయుల కాలంలో వ్యవసాయంపై వారి ప్రత్యేక దృష్టి కారణంగా ఏర్పడిన చెరువులు, సరస్సులు, గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు తరతరాలుగా మనకు వారసత్వంగా ఉండిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. 

Also Read..

కేసీఆర్.. తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం.. వెల్లడించిన ఇందిరాశోభన్

Tags:    

Similar News