బీఆర్ఎస్ అంటే రైతు సంక్షేమ పార్టీ..Minister Harish rao
రైతుల రుణాలు మాఫీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
దిశ, వెబ్ డెస్క్: రైతుల రుణాలు మాఫీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ అంటే రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి రుజువైందని అన్నారు. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీ చేసేందుకు గాను ఆర్థికశాఖ రూ.167.59 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. దీని ద్వారా 44,870 మంది రైతులకు లబ్దిచేకూరనుందని పేర్కొన్నారు.