CPR ఎలా చేయాలో శిక్షణ ఇస్తాం.. ఆరోగ్యశాఖ మంత్రి Harish Rao వెల్లడి

సీపీఆర్ ఎలా చేయాలో శిక్షణ ఇస్తామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.

Update: 2023-02-24 12:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ సర్కిల్ అరాంఘర్ చౌరస్తా వద్ద బస్‌స్టాప్‌లో శుక్రవారం ఉదయం ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ స్పందించి సీపీఆర్ చేసి అతడిని రక్షించాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్ రాజశేఖర్‌ను స్థానికులు, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. తాజాగా ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ను ఎంతో అభినందిస్తున్నాం.

సమయస్ఫూర్తితో స్పందించి CPR చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడటంలో ఆయన ప్రశంసనీయమైన పని చేశారు’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు. అంతేకాకుండా, ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీపీఆర్‌పై కీలక ప్రకటన చేశారు. అన్ని ఫ్రంట్‌లైన్ వర్కర్స్, కార్మికులు, వైద్య సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం తరఫున వచ్చే వారం నుంచి CPR ఎలా చేయాలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు.

Tags:    

Similar News