నిమ్స్న్యూరో సర్జరీ ఇక స్ట్రాంగ్.. రూ.2 కోట్లతో కొత్త పరికరాలు
హైదరాబాద్‌లోని నిమ్స్దవాఖాన న్యూరో సర్జరీ విభాగం బలోపేతం అయింది. రూ.2 కోట్లతో ప్రభుత్వం కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చింది.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని నిమ్స్దవాఖాన న్యూరో సర్జరీ విభాగం బలోపేతం అయింది. రూ.2 కోట్లతో ప్రభుత్వం కొత్త పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఇంట్రా ఆపరేటివ్న్యూరో మెనోయిటరింగ్, అల్ట్రా సోనిక్అస్పిరేటర్పరికరాలను సమకూర్చారు. వీటిని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా వస్క్యులర్ సర్జరీ సింపోసియం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్లక్ష్యమని స్పష్టం చేశారు.
అన్ని విభాగాల్లో పేషెంట్లకు వేగంగా వైద్యం అందాలన్నారు. న్యూరో సర్జరీ హెచ్‌వోడీ ప్రొఫెసర్ విజయ సారథి మాట్లాడుతూ.. నిమ్స్ న్యూరోసర్జరీ విభాగానికి నూతన పరికరాల కోసం నిధులు కేటాయించిన మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంట్రాఆపరేటివ్ అల్ట్రా సౌండ్ మిషన్‌తో మెదడులోని చిన్న కణతులు, ఇన్ఫెక్షన్‌లను గుర్తించి సులువుగా తొలగించవచ్చని చెప్పారు. ఇంట్రాఆపరేటివ్ న్యూరో మెనోయిటరింగ్‌తో మెదడు, వెన్నుపాము పనితీరును గుర్తించవచ్చన్నారు. అల్ట్రా సోనిక్అస్పిరేటర్తో మెదడు నుంచి కణతులను సురక్షితంగా తొలగించవచ్చని చెప్పారు. పక్కనే ఉన్న మెదడు కణజాలానికి హాని కలగకుండా సర్జరీలు చేయొచ్చన్నారు. ఈ సాంకేతికత బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలను విప్లవాత్మకంగా మార్చిందన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు.