మతపిచ్చి లేపడంలో BJP డబుల్ సక్సెస్: కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్
రైతుల పేరు చెప్తే కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ అన్నారు.
దిశ, వెబ్డెస్క్: రైతుల పేరు చెప్తే కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి హరీష్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన హరీష్ రావు కేంద్రం ప్రభుత్వం విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్లచట్టాలను వ్యతిరేకించినందుకే రైతులపై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపించారు. కిసాన్ అనే పేరు కనిపిస్తే చాలు నిధుల్లో కోత పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రైతుల పాలిట శాపంలా మారిన మీరా మాకు నీతులు చెప్పేదని ఈ సందర్భంగా బీజేపీని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పుట్టగతులుండవని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిండు పున్నమిలో చందమామను చూడాల్సిన వారు.. ఆ చంద్రుడిపై ఉన్న మచ్చల్ని వెతికే పనిలో ఉన్నారన్నారు. దేశ జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్ అయ్యిందని అన్నారు. అంతేకాకుండా మతపిచ్చి రేపడంలో బీజేపీ డబుల్ సక్సెస్ అయ్యిందని ఎద్దేవా చేశారు. వీటితో పాటుగా ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ దాడులు చేయించడంలో బీజేపీ సఫలమైందని విమర్శలు గుప్పించారు.