నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూపు-4 నోటిఫికేషన్‌పై క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సంగారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నూతన పెన్షన్ దారులకు స్మార్టు కార్డులను పంపిణీ చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సంగారెడ్డిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నూతన పెన్షన్ దారులకు స్మార్టు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2016 పెన్షన్ ఇస్తున్నామన్నారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రూ.600 మాత్రమే పింఛన్ ఇస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు పింఛన్లు అదిస్తున్నామని చెప్పారు. స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.3 లక్షల కార్యక్రమాన్ని దసరా పండుగ నుంచి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అంతేగాక, రెండు మూడు రోజుల్లో గ్రూప్-4 నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. పేదలకు ఉచితాలు ఇవ్వొద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యాపారులకు మాత్రం వేల కోట్లు మాఫీ చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర సర్కార్ అన్నింటి ధరలు పెంచి పేదలపై భారం మోపిందన్నారు.
Also Read : 'గ్రీన్ సిగ్నల్'లు కాదు.. నోటిఫికేషన్లు ఇవ్వండి: K Rajagopal Reddy