లోక్‌సభ ఎన్నికలకు ఎంఐఎం రెడీ.. ఆ మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీ!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు పోటీ సిద్ధమవుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు పోటీ సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పార్టీ అధినేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆలిండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ మూడు స్థానాల్లో నుంచి పోటీ చేయనుందని తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఔరంగాబాద్, కిషన్‌గంజ్ పార్లమెంటు స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపనున్నట్లు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బహదూర్‌పూర అసెంబ్లీ సెగ్మెంట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం తరపున ముగ్గురు అభ్యర్థులను నిలబెడుతున్నాయని తెలిపారు. పెద్దల సభలో ముస్లింల గళాన్ని వినిపించేందుకు తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అయితే, ఇప్పటి వరకు హైదరాబాద్ ఎంపీగా ఉన్ అసదుద్దీన్‌పై బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కూడా కేటాయించింది. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి తాము ఖచ్చితంగా పోటీ చేస్తామని, ప్రత్యర్థి పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.