‘ఆ రాష్ట్రాల్లో MIM పోటీ చేయలేదు. అయినా కాంగ్రెస్ ఓడిపోయింది’

ఇటీవల వెలువడిన ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఫలితాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

Update: 2023-03-04 13:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల వెలువడిన ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఫలితాలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు కాబోతుండగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంచనాలన్ని తప్పాయి. త్రిపురలో సీపీఎంతో కలిసి పోటీ చేసినా అక్కడ ఆశించిన స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేకపోయింది. ఈ పరిణామంపై అసదుద్దీన్ ఒవైసీ శనివారం సెటైర్లు వేశారు.

అమేథీ మాదిరిగా నాగాలాండ్, మేఘాలయ, త్రిపురలలో కూడా ఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమిని ఇప్పుడు కాంగ్రెస్ ఎవరిపై నింద వేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓటమి పాలైన ప్రతిసారి ఎంఐఎంపై విమర్శలు చేయడం సహజంగా మారిందని దుయ్యబట్టారు. కాగా మజ్లిస్ పార్టీ బీజేపీ బీ టీమ్‌గా మారి కాంగ్రెస్ ఓటింగ్ శాతానికి గండి కొడుతోందనే ఆరోపణలు హస్తం పార్టీ నుంచి తరచూ వినిపిస్తున్న వేళ ఒవైసీ ఈ కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News