మెట్రో రైల్‌ను ఓల్డ్ సిటీ వరకు విస్తరించాలి: అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్

వక్ఫ్ బోర్డు రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.

Update: 2023-02-08 15:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వక్ఫ్ బోర్డు రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూంకు లాక్ ఉంటే రికార్డులు మాయమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రికార్డులన్నింటీ డిజిటలైజేషన్ చేసి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. గండిపేటలో ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటుతో పాటు మోజాం, ఇమాంలకు వేతనాలు పెండింగ్‌లో లేకుండా మంజూరు చేయాలన్నారు. జీవో 58, 59 ప్రకారం నోటరైజ్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. ఏపీ రీ ఆర్గనైజింగ్ ప్రకారం వాటాను తేల్చాలని కోరారు.

పెండింగ్‌లో ఉన్న మైనార్టీ నిధులను మంజూరు చేయాలని, షాదీముబారక్ దరఖాస్తులు గతేడాది, ఈ ఏడాది కలపి 63,122 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లు, ఓవర్సిస్ స్కాలర్ షిప్‌లు మంజూరు చేయాలని, పురాణపూల్‌లో ఆడిటోరియం, మక్కామసీదు దగ్గర మరమ్మతులు, లాల్ ధర్వాజమందిర్ మరమ్ములు, కల్యాణమండపం నిర్మాణం, ఉస్మానియా దవాఖాన నిర్మాణం, యూనాని దవాఖాన అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ, డీఏ, పాతపెన్షన్ స్కీం అమలు, 317 జీవోతో బదిలీల సమస్య పరిష్కరించాలన్నారు. 500 కోట్లు కేటాయించి ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News