దసరాకు మండనున్న ఎండలు.. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచన

అక్టోబర్ మాసంలో వాతావరణం కాస్త కూల్‌గా ఉంటుందనే భావన అందరిలో ఉండటం సహజం. కానీ తెలంగాణ రాష్టంలో మాత్రం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ

Update: 2023-10-20 11:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అక్టోబర్ మాసంలో వాతావరణం కాస్త కూల్‌గా ఉంటుందనే భావన అందరిలో ఉండటం సహజం. కానీ తెలంగాణ రాష్టంలో మాత్రం మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ దసరాకు ఎండలు మండనున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరో మూడు రోజుల్లో బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడనుందని తెలిపారు.

ఇది ఆగ్నేయ బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం దిశగా ఆదివారానికి ( అక్టోబర్ 22 ) నాటికి తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపారు. దీని ప్రభావంతో ఏపీకి వర్ష సూచన ఉండగా.. తెలంగాణలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అయితే తీవ్ర వాయుగుండం కారణంగా దసరాకు ఉష్ణోగ్రత పెరగనున్నాయి.

నవంబర్ 15 తర్వాత చలి పెరిగే అవకాశం

ఇప్పటికే తెలంగాణలో వర్షాలు లేక దాదాపు నెలరోజులు కావొస్తుంది. అక్టోబర్‌లో సున్నా డిగ్రీల వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం ఎండలు, రాత్రిపూట చలితో భిన్న వాతావరణం కనిపిస్తోంది. నవంబర్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 15 తర్వాత చలి పెరిగే అవకాశముందని చెబుతున్నారు.

Tags:    

Similar News