Real estate : ఫ్రీ లాంచ్ పేరుతో రూ.150 కోట్ల టోకరా పెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ
ఫ్రీ లాంచ్ పేరుతో ఓ రియల్ ఎస్టేట్(Real estate) సంస్థ ఏకంగా రూ.150కోట్ల టోకరా వేసిన ఘటన వెలుగు చూసింది.
దిశ, వెబ్ డెస్క్ : ఫ్రీ లాంచ్ పేరుతో ఓ రియల్ ఎస్టేట్(Real estate) సంస్థ ఏకంగా రూ.150కోట్ల టోకరా వేసిన ఘటన వెలుగు చూసింది. ఆర్జే గ్రూప్(RJ Group) రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో వినియోగదారులతో డబ్బులు కట్టించుకున్న చక్క భాస్కర్ గుప్తా, సుధారాణిలు ఫ్రీ లాంచ్(free launch)పేరుతో భారీ మోసానికి పాల్పడగా బాధితులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. ఆర్జే గ్రూప్ హైదరాబాద్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆర్జే గ్రూప్ చైర్మన్ భాస్కర్, డైరెక్టర్ సుధారాణిలు బాధితుల నుంచి దాదాపు 600 మంది నుంచి రూ.150 కోట్ల వసూలు చేశారు. డబ్బులు కట్టి నాలుగేళ్లు అయినా ఇంతవరకూ ఫ్లాట్స్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని బాధితుల ఆరోపించారు. పలు వెంచర్లలో మా డబ్బులు పెట్టుబడులుగా పెట్టి వారు ఎంజాయ్ చేస్తున్నారని వాపోయారు.
చిత్రంగా ఈ ఆర్జే గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్స్ గా మ్యూజిక్ డైరెక్టర్ కోటి, ప్రమోటర్ గా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ లు వ్యవహరించడం ఆసక్తికరంగా మారింది. బాధితులంతా ఆర్జే గ్రూప్ చైర్మన్ భాస్కర్, డైరెక్టర్ సుధారాణిలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, వారిని వెంటనే అరెస్టు చేయాలని మాకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.