Harish Rao: నడిరోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు.. మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన ట్వీట్

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey)కు శ్రీకారం చుట్టింది.

Update: 2024-11-22 12:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అత్యంత ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey)కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఇంటింటికీ ఎన్యుమరేటర్లు (Enumerators) వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey)కు సంబంధించిన ఫారాలు నడిపోడ్డుపై పడిపోయిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని తార్నాక (Tarnaka) మెట్రో స్టేషన్ వద్ద సర్వేకు సంబంధించి నమోదు పత్రాలు రోడ్లపై చిత్తు కాగితాల్లా పడి ఉన్నాయి. తాజాగా, అదే వీడియోపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రజా పాలన (Praja Paalana) దరఖాస్తులు.. నేడు సమగ్ర కుటుంబ సర్వే (Comprehensive Family Survey) పత్రాలు నడిరోడ్డుకు ఎక్కాయని కామెంట్ చేశారు.

ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది మరో నిదర్శనమని అన్నారు. రోడ్లపై తెలంగాణ (Telanagana) ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యమా అని ప్రశ్నించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో ఇచ్చిన వివరాల భద్రత డొల్ల అని స్పష్టమవుతోందని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు సైబర్‌ మోసగాళ్ల (Cyber ​​Fraudsters) చేతికి చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటని ఫైర్ అయ్యారు. ప్రజల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని, ప్రజల వివరాలకు భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు.

Tags:    

Similar News