వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్..!
తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. దోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో ఇవాళ (శుక్రవారం) భారీ వర్షాలు పడే అవకాశం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. దోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలో ఇవాళ (శుక్రవారం) భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.