రెవెన్యూ కేడర్లలో త్వరలోనే పదోన్నతులు: CM KCR

త్వరలోనే రెవెన్యూ ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులపై వాకబు చేశారు. బుధవారం మెదక్‌లో నూతన కలెక్టరేట్ భవన

Update: 2023-08-23 13:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే రెవెన్యూ ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతులపై వాకబు చేశారు. బుధవారం మెదక్‌లో నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ బృందం సీఎంని కలిసింది. ఈ సందర్భంగా సీఎం వారితో మాట్లాడారు. అన్ని కేడర్లలో త్వరలో పదోన్నతులు ఉంటాయన్నారు. 100 మంది తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఆయనకు మెమెంటోను బహుకరించారు. సీఎంని కలిసిన వారిలో వంగ రవీందర్ రెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షులు మహేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి చరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైదులు, తహశీల్దార్లు హరదీప్ సింగ్, జ్ఞానజ్యోతి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ప్రణీత ఉన్నారు.

Tags:    

Similar News