Telangana: రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు.. వైద్యరోగ్యశాఖ సూచనలు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2022-03-31 09:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్న సమయంలో రోడ్లపై తిరగవద్దని సూచించింది. అత్యవసరం అయితే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించింది. నల్లటి దుస్తులు వేసుకోవద్దని, తెల్లటి దుస్తులు వేసుకుంటే ఎండ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపింది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలని సూచించింది.

చెమట పట్టకపోవడం, గొంతు ఎండిపోవడం, అత్యంత నీరసం, తలనొప్పి, గుండెదడ, మూత్రం రాకపోవడం వంటివి వడదెబ్బ లక్షణాలు అని, వడదెబ్బ తగిలిన వారిని వెంటనే బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించాలని తెలిపింది. ట్రాఫిక్ పోలీసులు, గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసేవాళ్ళు, జర్నలిస్టులు, ఎక్కువగా తిరిగే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

Tags:    

Similar News