మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. జర్నలిస్టుల సంక్షేమ పథకాలపై తీవ్ర చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు.

Update: 2024-09-02 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఆయనతో జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై తీవ్రంగా చర్చించారు. ఈ నెల 8 వ తేదీన రవీంద్రభారతీలో కార్యక్రమం నిర్వహించి.. JNJHS స్థలాల అప్పగింత కార్యక్రమంపై మాట్లాడనున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఆరోగ్య పథకం ఇతర సంక్షేమ పథకాల గురించి మీడియా చెర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు జరపనున్నారు. ఇప్పటికే జర్నలిస్టుల సంక్షేమ పథకాలపై స్వల్ప చర్చ జరిగినట్లు సమాచారం. ఈ వార్త కాస్త జర్నలిస్టుల చెవిన పడటంతో మీడియా అకాడమీ చెర్మన్ అండ్ రేవంత్ రెడ్డి జర్నలిస్టుల పథకాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మరీ జర్నలిస్టులకు లాభం చేకూరనుందా? లేదా? అనేది చూడాలి మరీ. 

 


Similar News