రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులెవరంటే..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కోరారు.

దిశ, ఘట్కేసర్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, తద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కోరారు. వయస్సు 21 నుంచి 60 సంవత్సరాలు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.
అభ్యర్థి సంవత్సర ఆదాయం గామీణ పాంతాల వారికి రూ.1,50,000, పట్టణ/ మున్సిపాలిటీ ప్రాంతాల వారికి రూ.2,00,000 మించి ఉండరాదని, మీ-సేవ నుండి పొందిన కులం, ఒక సంవత్సరంలోపు ఆదాయ ధ్రువపత్రం, ఆధార్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కలిగిన దారిద్ర్యరేఖకు దిగువన గల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత, ఆసక్తి కల అభ్యర్థులు TSOBMMS ఆన్లైన్ పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.in.లో ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 040-24020610 నెంబరులో సంప్రదించాలని సూచించారు.