‘తక్షణ సహాయం.. రక్షణ కవచం’సేవలు అభినందనీయం
తక్షణ సహాయం.. రక్షణ కవచం అనే సంస్థ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.

దిశ, తిరుమలగిరి : తక్షణ సహాయం.. రక్షణ కవచం అనే సంస్థ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ కార్ఖానాలోని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం భవన్ లో నిర్వహించిన సేవా కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సామాన్యులు సైతం అర్థం చేసుకోగల గణనతో విశ్వవసు నామ తెలుగు సంవత్సర సులభశైలి పంచాంగంను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో సుమారు1000 మందితో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ సభ్యులు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారని సమాచారం అందుతుందో వారికి వెంటనే సహాయ సహకారాలు అందించడానికి కృషి చేస్తుండడం వారి సేవా దృక్పథానికి నిదర్శనం అని అన్నారు.
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ ద్వారా అందిస్తున్న సేవలు హర్షణీయమని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మహిళల కోసం వికసత్ భారత్ ఏర్పాటు చేశారని, మహిళలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతూ గౌరవించబడతారో భారత దేశం కూడా అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల్ల రామకృష్ణ, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులు కొండ చంద్రశేఖర్, దొంతుల ముఖేష్ కుమార్, సిద్ధ సూర్యప్రకాశరావు, గార్లపాటి శ్రీనివాసులు, బోడ సూర్యప్రకాష్, సుజాత రమేష్ బాబు, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన గవర్నర్ లు కిషోర్ కుమార్, గట్టు రాణి, సాయి సునీత, రాధాకృష్ణమూర్తి, సుబ్బరామయ్య, పి.శ్రీనివాసరావు, రేణిగుంట్ల శ్రీనివాస్, కొల్లూరి పార్వతి పాల్గొన్నారు.