MP : మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించి వినాయక చవితి పర్వదినాన్ని మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Update: 2024-09-07 12:27 GMT

దిశ, కాప్రా: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించి వినాయక చవితి పర్వదినాన్ని మట్టి గణపతులను ప్రతిష్టించి పూజించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శనివారం కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్ బి కాలనీలోని వసంత రెడ్డి స్వీట్ హౌస్ సెంటర్లో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాలను ఎంపీ పంపిణీ చేశారు. బీజేపీ మల్కాజ్గిరి మేడ్చల్ అధికార ప్రతినిధి మునిగంటి రామ్ ప్రదీప్ ఆధ్వర్యంలో సుమారు వేయి మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. డివిజన్ లోని కాలనీ అసోసియేషన్ సభ్యులకు 50 చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పి. బ్రహ్మచారి, కే. గోపాల్ రెడ్డి, డి ఎల్ ప్రసాద్, వెంకన్న గౌడ్, జంగ బాలరాజ్, తాళ్లపల్లి లింగం, కే. తిమ్మారెడ్డి, సూర్య ప్రకాష్, ఎం. దేవేందర్, అపర్ణగౌడ్, ఉమారాణి, భారతి లు పాల్గొన్నారు.


Similar News