గణపయ్యల వీడ్కోలుకు ఏర్పాట్లు పూర్తి.. ఒక్కో చెరువు వద్ద ఒక్కో ఇంచార్జ్ అధికారి..

గణేష్ నిమజ్జోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 చెరువుల వద్ద మంగళవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు పర్యవేక్షిస్తున్నారు.

Update: 2024-09-16 15:21 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : గణేష్ నిమజ్జోత్సవానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 చెరువుల వద్ద మంగళవారం జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో చెరువు వద్ద ఇంచార్జిగా ఒక్కొక్క అధికారిని నియమించి వారి ద్వారా అన్ని శాఖల అధికార సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ యంత్రాంగం ముందుకెళ్తుంది.

ప్రత్యేక అధికారులు..

నిమజ్జన కార్యక్రమానికి తరలి వచ్చే భక్తుల ను దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, మున్సిపల్, విద్యుత్, జలమండలి శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చెరువుల వద్ద పోలీసు బందోబస్తును పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న 17 చెరువుల వద్ద ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. చెరువుల వద్ద ఏమైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు.

1 . సుతారి చెరువు (మేడ్చల్), వసంత లక్ష్మి( ఎంపీడీవో మేడ్చల్), ఫోన్ : 9849903330.

2. పెద్ద చెరువు (మేడ్చల్), నాగిరెడ్డి (ఎంసీ మేడ్చల్), ఫోన్ : 7032898999.

3. ప్రగతి నగర్ ట్యాంక్ ( బాచుపల్లి), సౌజన్య (ఎంసీ నిజాంపేట్), ఫోన్ : 7729003999.

4. నల్ల చెరువు (ఉప్పల్), జి. ఆంజనేయులు (డీసీ ఉప్పల్), ఫోన్ : 8008103667.

5. వెన్నెలగడ్డ చెరువు (జీడిమెట్ల), వై.నర్సింహ, (డీసీ కుత్బుల్లాపూర్ సర్కిల్), ఫోన్ : 9989930159.

6. పరికి చెరువు (గాజులరామారం), ఎల్.పి.మల్లయ్య (డీసీ గాజులరామారం), ఫోన్ : 6309529286.

7. ఐడిల్ ట్యాంక్(కూకట్పల్లి), టి.శ్యామ్ ప్రకాష్ (ఆర్డీఓ మల్కాజ్ గిరి) ఫోన్ : 7995073753.

8. బోవెన్ చెరువు (హస్మత్ పెట్), కృష్ణయ్య (కూకట్పల్లి సర్కిల్ డీసీ) ఫోన్ : 7337557245.

9. సున్నం చెరువు (కూకట్పల్లి) , జె.స్వామి (తహశీల్దార్ కూకట్‌పల్లి) ఫోన్ : 7995073755.

10. శామీర్‌పేట సరస్సు (శామీర్‌పేట), ఆర్.మమతా బాయి (శామీర్‌పేట ఎంపీడీఓ) ఫోన్ : 9849903332.

11. సఫిల్‌గూడ ట్యాంక్ (మల్కాజిగిరి), జి రాజు (డీసీ మల్కాజ్ గిరి) ఫోన్ : 7331189762 , 9154899636.

12. కొత్త చెరువు (అల్వాల్), వి శ్రీనివాస్ రెడ్డి (డిసీ అల్వాల్), ఫోన్ : 8985409173.

13. లింగం చెరువు (సూరారం), ఏ.రెహమాన్ ఖాన్ (ఎమ్మార్వో కుత్బుల్లాపూర్), ఫోన్ : 7995073757

14. ఎదులాబాద్ ట్యాంక్ (ఘట్కేసర్), ఎండీ.షబీర్ అలీ (ఎంసీ ఘట్కేసర్ ) ఫోన్ : 9154083769.

15. కాప్రా చెరువు (కాప్రా), ముకుంద్ రెడ్డి (డిసీ కాప్రా), ఫోన్ : 9000113021.

16. రాంపల్లి చెరువు (కీసర), రాజేంద్ర కుమార్ (ఎంసీ నాగారం), ఫోన్ : 7075596119.

17. చెర్లపల్లి చెరువు (కాప్రా), సుచరిత (తహశీల్దార్ కాప్రా మండలం) ఫోన్ : 7995073748


Similar News