ఫైర్ సేఫ్టీ పై నిర్లక్ష్యం.. ప్రమాదానికి కారణం..
ప్లాస్టిక్ సంచులు తయారు చేసే పరిశ్రమల్లో మంగళవారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు ఇప్పటికి పూర్తిగా అదుపులోకి రాలేదు.
దిశ, పేట్ బషీరాబాద్ : ప్లాస్టిక్ సంచులు తయారు చేసే పరిశ్రమల్లో మంగళవారం సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మంటలు ఇప్పటికి పూర్తిగా అదుపులోకి రాలేదు. దట్టమైన పొగలు, కొద్దిపాటి మంటలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. జీడిమెట్ల - దూలపల్లి రోడ్డులో ఉన్న ఎస్ ఎస్ వి ఫ్యాబ్ ఇండస్ట్రీ లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంబంధించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో సైతం 7 ఫైరింజన్లు, పదుల సంఖ్యలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు మంటలు ప్రయత్నం చేస్తున్నాయి.
వందకు పైగా నీటి ట్యాంకర్లు..
మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయం నుంచి మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రస్థాయిలో పనిచేస్తున్నారు. అంతేకాకుండా హెచ్ఎండబ్ల్యూఎస్ రిజర్వాయర్ నుంచి నీటి ట్యాంకర్ సైతం కంపెనీ మంటలను ఆర్పేందుకు వినియోగిస్తున్నారు. అదే విధంగా కొన్ని ప్రైవేటు బోరు లభించి కూడా ట్యాంకర్లు తప్పించి పనిచేస్తున్నారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు 100కు పైగా నీప్ ట్యాంకర్లు తెప్పించినట్లు పైప్ సిబ్బంది పేర్కొన్నారు.
భారీ అగ్నిప్రమాదం..
దూలపల్లి రోడ్డులో ఉన్న ఎస్ఎస్వి ఫ్యాబ్ ఇండస్ట్రీలో మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో భయంతో అందులో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో మంటలు పెద్దగా వ్యాపించి కంపెనీ రెండవ అంతస్తు పాటుగా పెంట్ హౌస్ సైతం పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. తొలుత సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా సనత్ నగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఎల్ బి నగర్ ఫైర్ స్టేషన్ సంబంధించిన ఫైర్ ఇంజన్లు ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేసే పనిలో పడ్డారు.
కమ్ముకున్న దట్టమైన పొగలు..
పరిశ్రమలు అంటుకున్న మంటలు కారణంగా పెద్ద ఎత్తున నల్లని పగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసాయి. సుదూర ప్రాంతాన్నించి కూడా నల్లని పొగ అలుముకున్నట్లు కనిపించింది. ప్లాస్టిక్ ముడిసరుకుతో పాటుగా, సంచులు, పెయింటింగ్ ముడి పదార్థాలు దగ్ధం అవటంతో భారీ పొగలతో కాలుష్యం చుట్టేసింది. కంపెనీలో ప్లాస్టిక్ సంచులు తయారీతో పాటుగా ఆ సంచులపై ప్రింటింగ్ వేసే పని కూడా చేస్తుంటారు. ప్రింటింగ్ వేసే సందర్భంగా ఉపయోగించే రసాయన రంగుల వలనే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
పనిచేయని ఫైర్ సేఫ్టీ..
పరిశ్రమలలో అనుకోని ప్రమాదం జరిగితే తక్షణమే ఉపయోగించాల్సిన ఫైర్ సేఫ్టీ యూనిట్లు ఏవి కూడా ఎస్ఎస్సి ఫ్యాబ్ ఇండస్ట్రీలో పనిచేయడం లేదని విషయం తెలుస్తుంది. భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ కంపెనీకి ఫైర్ సేఫ్టీ పైప్ లైన్ ఒకటే ఒకటి ఉండటం అది కూడా పూర్తిగా పనిచేయకపోవడం కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుంది. కంపెనీ చుట్టూ రెండు ప్రాంతాల్లో అగ్నిప్రమాదం సంభవిస్తే ఉపయోగించటానికి ఇసుక ఉంచిన బకెట్లు ఉన్నా అవి సరైన నిర్వహణతో లేనట్లుగా కనిపించాయి. అంతేకాకుండా ఫైర్ ప్రివెంట్ సిలిండర్స్ కూడా ఓ మూలన పడేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. పేరుకే కంపెనీ ఆవరణలో ఫైర్ సేఫ్టీ టూల్స్ ఏర్పాటు చేసినట్లుగా అర్థమవుతుంది.
ఇక కంపెనీ ఆవరణలో 33 కేవీ హై టెన్షన్ లైన్ ఉండటం మూలాన మంటలు అర్పడానికి చాలా ఆలస్యమైంది. కంపెనీ చుట్టూ ఖాళీగా ఉండాల్సిన ప్రదేశంలో ఓ వైపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారు. దీంతో ఫైర్ ఇంజన్లు కంపెనీ చుట్టూ తిరగలేక ఒకదాని తర్వాత ఒకటి రివర్స్ చేసుకుంటూ మంటల అర్పవలసి వచ్చింది. ఎస్ఎస్ వి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ ఇంతలా డివియేషన్స్ కు పాల్పడిన అంశం ఫైర్ సేఫ్టీ, ఐల, పీసీబీ తదితర ప్రభుత్వ శాఖ అధికారుల దృష్టిలో ఎందుకు పడలేదు..? పడినా చూసి చూడనట్లు వ్యవహరించారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలో ఉన్న పైప్ సేఫ్టీ పరికరాల్లో పరిశీలిస్తే కంపెనీలో పనిచేసే కార్మికులకు అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో ఏ విధంగా స్పందించాలో కనీస అవగాహన లేనట్లుగా తెలుస్తుంది.