ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైల బదిలీలు..

ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ

Update: 2024-07-05 16:13 GMT

దిశ,ఉప్పల్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎం. మధుసూదన్ ను మహేశ్వరం పోలీస్ స్టేషన్ కు, యు.రమేష్ ను నాగోల్ పోలీస్ స్టేషన్ కు, బి.నెహ్రూ ను హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు, ఎస్ కోటేశ్వర్ రావును బాలాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ చేశారు. కాగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వి.చిరంజీవి, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న టీ మధు, వనస్థలిపురంలో పనిచేస్తున్న ఏ.మాధవరెడ్డి,భువనగిరి ఎస్ఓటీలో పనిచేస్తున్న జి.రఘురాములు ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు.


Similar News