'పెన్షన్ దారులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేయాలి'

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో దివ్వాంగులకు ఇచ్చిన పెన్షన్ల పెంపు వాగ్దానాలను అమలు చేయాలనీ వికలాంగుల హక్కుల పోరాట కమిటి నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-07-03 16:27 GMT

దిశ, అల్వాల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో దివ్వాంగులకు ఇచ్చిన పెన్షన్ల పెంపు వాగ్దానాలను అమలు చేయాలనీ వికలాంగుల హక్కుల పోరాట కమిటి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అల్వాల్ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాచేసి తమ డిమాండ్లను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నిక ప్రచారంలో వికలాంగులకు ఆరువేలు వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే నూతన పెన్షన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న పెన్షన్లు అమలు కాక వికలాంగుల జీవనవిధానం దెబ్బతిందని తెలిపారు. అందులో భాగంగానే ఈ నెల 5వ తేదీన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కార్యాలయాల వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి భారీ ఎత్తున హాజరై మహాధర్నాను విజయవంతం చేయాలని జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వినయ్, అల్వాల్ సర్కిల్ వికలాంగులకు పిలుపు నిచ్చాడు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఎరుపలి మంగమ్మ, బండారి లక్ష్మీ, జి. సురేష్ కుమార్, నగలింగం, రజిత, ఇష్మెందర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.


Similar News