మంత్రి మల్లారెడ్డికి మళ్లీ చేదు అనుభవం... (వీడియో)

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం చేస్తామని నేటి నుండి తలపెట్టిన...Tension at Minister Mallareddy Padayatra

Update: 2022-11-20 08:05 GMT

దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారం చేస్తామని నేటి నుండి తలపెట్టిన పాదయాత్ర మంత్రి మల్లారెడ్డికి తలనొప్పిగా మారింది. ఆదివారం కార్పొరేషన్ పరిధిలలోని గబ్బిలాల పేటలో పాదయాత్ర చేస్తున్న మంత్రి మల్లారెడ్డికి ఒక్కసారిగా ముందుకు వచ్చి స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్లు, నేతలు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాటలు జరిగాయి. మంత్రి ఆదేశాలతో వెంటనే స్పందించిన పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

ఆర్భాటాలు వద్దు... అభివృద్ధి కావాలి: కాంగ్రెస్ పార్టీ డిమాండ్

కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల ముందుకు వెళ్లడం మంత్రి మల్లారెడ్డికి చేదు అనుభవం ఎదురయింది. మంత్రి మల్లారెడ్డి ఎన్నో ఏళ్లుగా ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకుండా ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టెందుకే పాదయాత్ర చేపట్టారని కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో మంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడింది. గబ్బిలాల పేటలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని చెప్పి ఇప్పటికీ చేపట్టలేదని ప్రశ్నించారు. కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ప్రతి ఇంటికి హక్కు కల్పించలేని మంత్రి ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారంటూ అడ్డుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు మంత్రి చుట్టూ ఉంటూ ఆర్భాటాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని, ప్రారంభించిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్న మంత్రి వ్యవహారం ప్రజలను తీవ్ర అసహనానికి గురి చేస్తుందని వాపోయారు. అరెస్టులతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని, తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.



Similar News