ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం
ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.
దిశ,శామీర్ పేట : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరమని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మండలం జగన్ గూడ గ్రామానికి చెందిన రాయి బాలకృష్ణకు రూ.45 వేలు, కొమ్ము రాజమ్మ కు రూ.19 వేలు, సీహెచ్. మహేశ్వరికి రూ.25 వేలు, మూడు చింతలపల్లి గ్రామానికి చెందిన మహంకాళి వైష్ణవికి రూ.45 వేలు వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని వర్తింపజేయాలని స్థానిక నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో మూడు చింతల పల్లి మాజీ సర్పంచ్ జాం రవి, జగన్ గూడ మాజీ సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వలందాస్ మురళి గౌడ్, చెక్కల నరసింహులు ముదిరాజ్, బి. నర్సింహులు, తూము శ్రీశైలం పాల్గొన్నారు.