మత్స్యకారుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి

గాజుల రామారం డివిజన్ చింతల చెరువులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు.

Update: 2024-11-12 11:52 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : గాజుల రామారం డివిజన్ చింతల చెరువులో ఎమ్మెల్యే కేపీ వివేకానంద మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వ హయాంలో చెరువులలో మురుగునీరు కలవకుండా ఎస్టీపీలను నిర్మించినట్టు తెలిపారు. దాంతో మంచి చేపలు చెరువులలో లభ్యమవ్వడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంటాయన్నారు. ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ- ఏ లోకి మార్చాలనే డిమాండ్ ను ఇప్పటికే అసెంబ్లీలో చర్చించినట్టు తెలిపారు.

    మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. అనంతరం చెరువు వద్ద గల కోటగుట్ట పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో -ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డైరెక్టర్లు కె.రాము, సత్యవతి, లక్ష్మణ్, జిల్లా మత్స్యశాఖ అధికారి కీర్తి, గాజులరామారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు యాదగిరి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దుర్గయ్య, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కమలాకర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Similar News