తురక చెరువు అభివృద్ధికి హైడ్రా చర్యలు

నిజాంపేట్ తురక చెరువు అభివృద్ధికి హైడ్రా చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.

Update: 2024-11-27 13:29 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ తురక చెరువు అభివృద్ధికి హైడ్రా చర్యలు తీసుకుంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిజాంపేట్ బండారి లే ఔట్ సంక్షేమ సంఘం అసోసియేషన్ నేతల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ బుధవారం తురక చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. తురక చెరువు తూము, కట్ట, ఎఫ్ టీ ఎల్, బఫర్లను ఆయన పరిశీలించారు.

     చెరువు కట్టపై వెలిసిన అక్రమ నిర్మాణాలను కొద్ది రోజులలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కో ఆర్డినేషన్ చేసుకుని తొలగించాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు. తురక చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ లను ఫిక్స్ చేసి తురక చెరువును ఆహ్లాదభరితంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. కమిషనర్ పర్యటనలో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ సాబీద్ అలీ, బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, బండారి లే ఔట్ అసోసియేషన్ నేతలు పాల్గొన్నారు. 


Similar News