Corporator : ప్రజావాణిలో కనిపించని అధికారులు..
మల్కాజిగిరి మున్సిపల్ అధికారుల తీరు పై కార్పొరేటర్ శ్రవణ్ నిలదీశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణిలో చర్చించడానికి ఇంజనీరింగ్, శానిటైజేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరూ లేకపోవడంతో డిప్యూటీ కమిషనర్ ను కార్పొరేటర్ శ్రవణ్ నిలదీశారు.
దిశ, మల్కాజిగిరి : మల్కాజిగిరి మున్సిపల్ అధికారుల తీరు పై కార్పొరేటర్ శ్రవణ్ నిలదీశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణిలో చర్చించడానికి ఇంజనీరింగ్, శానిటైజేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరూ లేకపోవడంతో డిప్యూటీ కమిషనర్ ను కార్పొరేటర్ శ్రవణ్ నిలదీశారు. దీంతో డిప్యూటీ కమిషనర్ రాజు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పిలిపించినా డి. ఈ మహేష్ రాకపోవడం గమనార్హం. గత ప్రజావాణిలో జీహెచ్ఏంసీ పార్కుల పరిరక్షణ, కాలనీ లేఔట్ ల తయారీ, డబల్ ప్రాపర్టీ నెంబర్ తీసివేత, నాలాల చేపట్టిన నిర్మాణాల పై ఫిర్యాదులు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. పట్టణ టౌన్ ప్లానింగ్ లో విభాగంలోని చైన్ మెన్ ల ఇష్టారాజ్యం నడుస్తోందనీ అందువల్లే అక్రమ నిర్మాణాలతో సిబ్బంది చేతులు కలిపి ప్రొత్సహించడం కారణంగానే నాలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి వ్యవహరించాలని కార్పొరేటర్ అధికారులకు సూచించారు.
సమగ్ర సర్వే ఎక్కడ..?
మల్కాజిగిరి మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తోన్న కుల గణన సర్వే నామమాత్రంగానే నిర్వహిస్తున్నారని కార్పొరేటర్ శ్రవణ్ ఆరొపించారు. మున్సిపల్ సిబ్బంది సర్వే పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, నిధుల కొరత సాకుతో పనులు నిలిచిపోయాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో సర్వే పనుల్లో ఇంటికి స్టిక్కర్లు కూడా వేయలేదన్నారు.