రాష్​ డ్రైవింగ్.. ఆపై కత్తితో దాడి

రాష్ డ్రైవింగ్ చేస్తూ పాదచారిని ఢీకొట్టి.. నెమ్మదిగా వెళ్లండని అన్నందుకు క్షతగాత్రుడిపైనే కత్తితో దాడి చేసిన ఘటన ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది.

Update: 2023-02-23 11:13 GMT

దిశ, చార్మినార్: రాష్ డ్రైవింగ్ చేస్తూ పాదచారిని ఢీకొట్టి.. నెమ్మదిగా వెళ్లండని అన్నందుకు క్షతగాత్రుడిపైనే కత్తితో దాడి చేసిన ఘటన ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్ దేవ్ పల్లికి చెందిన ఓ యువకుడు మెడికల్ షాపుకు అని బయటకు వెళ్లాడు. మెడిసిన్​ తిసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో అదే ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల యువకుడు బైక్​పై ర్యాష్​ డ్రైవింగ్ చేస్తూ ఆ యువకుడిని ఢీకొట్టి వెళ్లాడు. దీంతో సదరు యువకుడు నెమ్మదిగా వెళ్లాలని మందలించాడు.

దీంతో ఇరువురి మధ్య  కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలోనే మోటర్ సైకిల్ పై ఉన్న యువకుడు ఇప్పుడే ఉండు నీ అంతు చూస్తానని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరి కాసేపటికి తన మిత్రుడు ఆలీ (18)తో కలిసి తిరిగొచ్చి మరోసారి పాదాచారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఆలీ పాదాచారి పక్కటెముకల కింద పొడిచాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News