బీజేపీ హయాంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాయి : ఈటల
మేడ్చల్ రైల్వే స్టేషన్ లోని ఆర్‌యుబి పనులను రైల్వే ఉన్నత
దిశ,మేడ్చల్ టౌన్: మేడ్చల్ రైల్వే స్టేషన్ లోని ఆర్‌యుబి పనులను రైల్వే ఉన్నత అధికారులతో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గురువారం పరిశీలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు నరేంద్ర మోడీ హయాంలో తెలంగాణ రాష్ట్రం రెండు వేల కోట్లకు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు చెప్పారు. మేడ్చల్ రైల్వే స్టేషన్ లో 32 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. గౌడవెల్లి గుండ్ల పోచంపల్లి అల్వాల్ బొల్లారం అమ్మ గూడా రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారన్నారు. మెట్రో రైల్ మాదిరిగానే ఎంఎంటీఎస్ రైలు కూడా దగ్గర స్టేషన్ లో ఏర్పాటు చేయమని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
ప్రజలు కోరుతున్న ప్రతి అవసరాలను ఢిల్లీలోని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి వీళ్లంతా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరో 20 సంవత్సరాలు ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని అండర్ పాస్ పనులను అభివృద్ధి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు వికె సింగ్ ముత్యాల నాయుడు, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ హైదరాబాద్ గోవిందరావు, మేడ్చల్ స్టేషన్ సూపర్డెంట్ లక్ష్మీనారాయణ, బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ అమర మోహన్ రెడ్డి, బీజేపీ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు ఆంజనేయులు,కౌన్సిలర్ హంసా రాణి కృష్ణ గౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్, నాయకులు రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.