కలెక్టర్ పై దాడికి నల్ల బ్యాడ్జీలతో నిరసన
వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడిని మేడ్చల్ జిల్లా అధికార యంత్రాంగం ఖండించింది.
దిశ,మేడ్చల్ బ్యూరో : వికారాబాద్ జిల్లాలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడిని మేడ్చల్ జిల్లా అధికార యంత్రాంగం ఖండించింది. సోమవారం వికారాబాద్ జిల్లా దుద్యల మండలం లగిచెర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ లో భోజన విరామసమయంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తో కలిసి తెలంగాణ గెజిటెడ్ ఆఫీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, అధికారులు అందరూ నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు, అధికారులకు భద్రత కల్పించాలని కోరారు. ఇటువంటి ఘటన వల్ల అభద్రతా భావన కలుగుతుందని, ఈ దాడికి పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి దాడులు పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు.