ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర : ఎంపీ ఈటల

ప్రజా క్షేత్రంలో ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర అని మల్కాజ్గిరి ఎంపీ

Update: 2024-07-05 12:00 GMT

దిశ, ఘట్కేసర్ : ప్రజా క్షేత్రంలో ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం పోచారం మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వార్డులలో తలెత్తే ప్రతి చిన్న సమస్య పట్ల బాధ్యతగా కౌన్సిలర్లు స్పందించి పరిష్కారం చేయాలని సూచించారు. ప్రధానంగా తాగునీటి సరఫరా ,డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పట్ల దృష్టి సారించాలన్నారు. బడ్జెట్ సమావేశంలో మున్సిపల్ అభివృద్ధి కోసం కేటాయించిన మున్సిపల్ నిధులు వార్డుల వారీగా కౌన్సిలర్లు పంచుకోకుండా సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్య పరిష్కారం కోసం నిధులను ఖర్చు చేయాలని సూచించారు. మొదటిసారి పోచారం మున్సిపాలిటీ సాధారణ సమావేశానికి హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం మున్సిపల్ పరిధిలోని అన్నోజిగూడ ఎన్ టి పి సి చౌరస్తా వద్ద అండర్పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి పత్రాలను అందించారు. మున్సిపల్ పరిధిలో ప్రధాన రహదారి తో పాటు, కాలనీలలో విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ బల్బులు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన కాంట్రాక్టర్లు 10 నెలలుగా ఏర్పాటు చేయలేదని వార్డు కౌన్సిలర్ బాలగోని వెంకటేష్ గౌడ్ ఎంపీ రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ బల్బుల ఏర్పాటు కాంట్రాక్టు ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుని స్థానిక సంస్థలకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం రూ.1 కోటి 93 లక్షల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బీటీ రోడ్డు ,సీసీ రోడ్లు భూగర్భ డ్రైనేజీ పనులు, పోచారం మున్సిపల్ పారిశుద్ధ్య విభాగం నందు పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫార్మ్స్, సబ్బులు, ఆయిల్, ఇతర వస్తు సామాగ్రి కొనుగోలు, పలు అంశాలపై చర్చించారు.

కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పస్య వేమన్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్డి యా నాయక్, కౌన్సిలర్లు గొంగల మహేష్, నర్రి ధనలక్ష్మి, చింతల రాజశేఖర్, సింగిరెడ్డి సాయిరెడ్డి, అకిటి శైలజ, మెట్టు బల్ రెడ్డి,నల్లబెల్లి లక్ష్మి, బెజ్జంకి హరి ప్రసాద్ రావు,సామల శ్రీలత, అబ్బవతీ సరిత, మోటుపల్లి పోచమ్మ , సుర్వి సుధా లక్ష్మి, బద్దం మమత, కో ఆప్షన్ సభ్యులు అక్రమ్ అలీ, శకుంతల, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. కాగా మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గైర్హాజరు పై పలువురు చర్చించుకున్నారు.


Similar News