చెత్తలో కూర్చొని ఎమ్మెల్యే నిరసన

రెండో రోజు సైతం ప్రజలతో కలిసి చెత్తలో కుర్చొని మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిరసన కార్యక్రమం కొనసాగించారు.

Update: 2025-03-17 12:59 GMT
చెత్తలో కూర్చొని ఎమ్మెల్యే నిరసన
  • whatsapp icon

దిశ, అల్వాల్ : రెండో రోజు సైతం ప్రజలతో కలిసి చెత్తలో కుర్చొని మల్కాజగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిరసన కార్యక్రమం కొనసాగించారు. గత రెండు రోజులుగా మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని శ్మశానవాటికలోని డంపింగ్ యార్డు తొలగించి, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతూ స్థానిక కాలనీవాసులతో కలిసి డంపింగ్ యార్డులో చెత్తలోనే కూర్చొని నిరసన తెలిపారు. సోమవారం సైతం నిరసన కార్యక్రమం కొనసాగించారు. స్టాప్ ఇల్లీగల్ డంపింగ్.. సేవ్ ఇన్ హిందూ గ్రేవ్ యార్డ్ అనే నినాదాలతో దాదాపు 50 కాలనీల ప్రజలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని, హిందూ సంప్రదాయాలను, వారి మనోభావాలను లెక్క చేయకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు.

    డంపింగ్ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్త వల్ల ప్రజాజీవనం కాలుష్య భరితమై చిన్న పిల్లలు, వృద్దుల ఆరోగ్యాలు ప్రశ్నార్థకంగా మారాయని తెలిపారు. దీంతో భూగర్భజలాలు విషపూరితమై పరిసరప్రాంతాలన్నీ కాలుష్యమవుతున్నాయని, పర్యావణం పూర్తిగా చెడిపోయి మనుషుల మనుగడకు పెను ప్రమాదంగా మారిందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారడమే సమస్యకు కారణం అని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు చూసైనా అధికారులు ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. ఈ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు ధర్నా నిర్వహిస్తామని, అవసరం అయితే అల్వాల్ సర్కిల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.

    సమస్య పరిష్కారం కాకుంటే ముఖ్యమంత్రి దృష్టికి సైతం తీసుకెల్లి అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనలకు స్థానిక సీఐ రాహుల్ దేవ్,పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం అధికారులు, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు డోలీ రమేష్, ఢిల్లీ పరమేష్, మందశోభన్ బాబు, శరణ్ గిరి, ఉదయ్ ప్రకాష్, దిలీప్, సుధాకర్ పడాల, ప్రశాంత్ రెడ్డి, కరుణ శ్రీ, హరిత ముదిరాజ్ పాల్గొన్నారు. 

Read More..

 ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి.. కలెక్టర్ బీఎం సంతోష్.. 


Similar News