RabinHood : యంగ్ హీరోతో స్టెప్పులేసిన మల్లారెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(BRS MLA Mallareddy) గురించి తెలియని వారుండరు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి(BRS MLA Mallareddy) గురించి తెలియని వారుండరు. ఏదైనా కార్యక్రమానికి హాజరైతే అక్కడ అందరినీ హుషారెత్తించడానికి డ్యాన్స్ చెబుతూ.. సినిమా డైలాగ్స్ చెబుతూ ఉంటారు. బుధవారం కూడా అలాగే మల్లారెడ్డికి చెందిన కళాశాలలో జరిగిన ఒ కార్యక్రమంలో స్టెప్పులేసి అందర్నీ సరదా పరిచారు. ఈసారి టాలీవుడ్ యంగ్ హీరోతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేయడంతో ఆడిటోరియం దద్దరిల్లిపోయేలా విద్యార్థులు కేరింతలు కొట్టారు. అయితే హీరో నితిన్(Nithiin) తాజా చిత్రం 'రాబిన్ హుడ్'(RabinHood) ఈనెల 28న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ జోరు పెంచింది. రాబిన్ హుడ్ చిత్రం నుంచి "అదిదా సప్రైజు" అంటూ సాగే గీతాన్ని బుధవారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. సాంగ్ రిలీజ్ తర్వాత హీరో నితిన్ తో కలిసి మల్లారెడ్డి స్టెప్పులేసి అందర్నీ ఉర్రూతలూగించారు. విద్యార్థులు కూడా హుషారుగా డ్యాన్స్ చేయడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న 'రాబిన్ హుడ్' సినిమాలో నితిన్ తో శ్రీలీల(Srileela) జోడీ కట్టింది.