అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం..

బాలానగర్​ డివిజన్​ పరిధిలో రూ. 88 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం స్థానిక కార్పొరేటర్​ ఆవుల రవీందర్​ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

Update: 2023-06-03 17:37 GMT

దిశ, కూకట్​పల్లి: బాలానగర్​ డివిజన్​ పరిధిలో రూ. 88 లక్షల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం స్థానిక కార్పొరేటర్​ ఆవుల రవీందర్​ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి  కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దశలవారిఆ అభివృద్ధి చెందుతూ వచ్చిందని, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు.

గడిచిన 9 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అనేక రంగాలలో అభివృద్ధి సాధించిందని అన్నారు. అప్పట్లో కరెంట్​ కోతలతో ఇబ్బంది పడిన రాష్ట్రం నేడు మిగులు విద్యుత్​ సాధిస్తుందని అన్నారు. నీటి కొరతతో ఇబ్బంది పడిన రాష్ట్రం నేడు మిషన్​ కాకతీయతో రైతులకు సాగునీరు పుష్కలంగా అందిస్తుందని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్​ అందిస్తు పంటల దిగుబడిని భారీగా పెంచిందని గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.

Tags:    

Similar News