మల్కాజిగిరి ఎమ్మెల్యేకు మౌలాలీలో చేదు అనుభవం...

మల్కాజిగిరి సర్కిల్ మౌలాలీ డివిజన్ ఆర్టీసీ కాలనీలో రోడ్డు గుంతలమయమై, అధ్వాన్నంగా మారినా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ధర్నా చేసిన ఘటనలు చొటుచేసుకున్నా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పట్టించుకోలేదు.

Update: 2024-07-04 17:45 GMT

దిశ, మల్కాజిగిరి : మల్కాజిగిరి సర్కిల్ మౌలాలీ డివిజన్ ఆర్టీసీ కాలనీలో రోడ్డు గుంతలమయమై, అధ్వాన్నంగా మారినా అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు ధర్నా చేసిన ఘటనలు చొటుచేసుకున్నా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పట్టించుకోలేదు. అదే మాజీ ఎమ్మెల్యే చొరవతో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుంటే గురువారం ఆర్భటంగా రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే పై స్థానికులు తిరగబడ్డారు. సమస్యల పై స్పందించని ఎమ్మెల్యే రోడ్డు పనులు షురూ అయ్యాక పరిశీలించడమేమిటని స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తొపులాటలు, వాగ్వివాదం చొటుచేసుకుంది.

దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రికత్త కు దారి తీసింది. గత ఎనిమిది నెలలుగా రోడ్డు పనులు నిలిచిపోయి, ప్రయాణికులు నానా ఇక్కట్లకు గురై, ప్రమాదాల బారిన పడినా పట్టించుకోని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి చొరవతో రోడ్డు పనులు షురూ కాగానే ఇక్కడి పనులను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయటం ఎమిటని స్థానికులు నిలదీశారు. పోలీసులు పరిస్థితిని చక్కబెట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలు తనకు అండగా ఉండాలని ఎమ్మెల్యే కొరారు. బీఆర్ఎస్ నాయకులు అమీనుద్దిన్, ఉస్మాన్, భాగ్యనందరావు, కాంగ్రెస్ నాయకులు వినోద్ యాదవ్, ఫైజల్, నర్సింహా, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.


Similar News