ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే - మంత్రి మల్లారెడ్డి
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ ప్రతినిధి, మేడ్చల్ : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ నోరు జారారు మల్లన్న.
ఈ విషయం పై స్పందించిన మంత్రి మల్లారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు. మాది రాజకీయ పార్టీ అని.. ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల స్టంట్స్ అనేవి ఎలాగైనా వుంటాయన్నారు. కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉందా? లేదా? అది ఆలోచన చేయాలని హితవు పలికారు. కార్మికులు సంతోషంగా ఉన్నారని అది గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటే దమ్ము, ధైర్యం, ఫండ్స్ కావాలన్నారు. అవన్నీ తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు మాత్రమే ఉన్నాయన్నారు.
Read More : అన్ని పార్టీల్లో అభ్యర్థులను నేనే డిసైడ్ చేస్తా: Minister Malla Reddy