మంత్రికోసం చెప్పులు లేకుండా ఎండలో విద్యార్థులు..
మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేయర్ జక్కవెంకట్ రెడ్డి తో పాటు మంత్రి మల్లా రెడ్డి పాల్గొన్నారు.
దిశ, మేడిపల్లి : మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మేయర్ జక్కవెంకట్ రెడ్డి తో పాటు మంత్రి మల్లా రెడ్డి పాల్గొన్నారు. 20 వార్డు శివసాయి నగర్ కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును మంత్రి ప్రారంభించారు. అటు తర్వాత పర్వతాపూర్ లో గల మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల యందు అదనపు తరగతి గదులను, డిజిటల్ క్లాస్ రూము ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. మింట్ కాంపౌండ్ హైదరాబాద్ వారి సహకారంతో సుమారు 68 లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాలను ప్రయివేట్ పాఠశాలగ తీర్చిదిద్దారు. అదే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 50 లక్షల నిధులను కూడా ఈ పాఠశాల అభివృద్ధి కోసం మంజూరు చేశారు.
మంత్రి మల్లా రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు మంచి చదువు అందించాలని దృక్పథంతో మింట్ కాంపౌండ్ వారు 68 లక్షలతో ఈ అదనపు తరగతి గదులు డిజిటల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకోవాలని ఏ సమస్య వచ్చినా మీరే పరిష్కరించాలని మింట్ కాంపౌండ్ వారిని మంత్రి కోరారు, ప్రైవేట్ కి దీటుగా ఈ మేడ్చల్ జిల్లాలోనే ఎక్కడా లేనివిధంగా ఈ పాఠశాలను తీర్చిదిద్దాలని వారిని కోరారు, అలానే ఎంత మంచిగా చదువుకుంటే అంత గొప్పవారు అవుతారని పిల్లలు ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం పీర్జాదిగూడ డంపింగ్ యార్డ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన తడి పొడి చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసే ట్రేడెడ్ అండ్ బ్రిక్కెడ్ యంత్రాలను మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, ఎక్కడ లేని విధంగా పీర్జాదిగూడలో అభివృద్ధి జరుగుతుందని అనేక నూతన టెక్నాలజీ తో అభివృద్ధిలో దూసుకుపోతున్నారని పీర్జాదిగూడ మేయర్ ని, కమిషనర్ ని, కార్పొరేటర్లు ను ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి అభినందించారు.
శుక్రవారం 2.03 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు, 2వ వార్డు లో 32 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్సీ వైకుంఠదామమును మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అదినాతన వైకుంఠ దామం పిర్జాదిగూడలోనే నిర్మించారాని మంత్రి మల్లారెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి తో పాటు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కోసం పూలతో కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో విద్యార్థులు..
పాఠశాల ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న మంత్రి మల్లారెడ్డికి స్వాగతం పలకడానికి ఎండలో నిలబెట్టిన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదవ డివిజన్ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సిబ్బంది. ఒక కార్యక్రమం ముగించుకుని తరువాత కార్యక్రమం పాఠశాల ప్రారంభోత్సవానికి రాకముందు అల్పాహారం తీసుకోవడానికి మంత్రి అదే ప్రాంతంలో కార్పొరేటర్ ఇంటికి వెళ్లారు, ఈ లోపు మంత్రి వస్తారని విద్యార్థులు చెప్పులు లేకుండా ఎండలో చేతుల్లో పువ్వులు పట్టుకుని నిలబడ్డారు. ఈ సంఘటన చూసి పలువురు అధికారులపై మండిపడ్డారు, ఒకపక్క ఎండలు ఎక్కువ ఉండడంతో చిన్నారులను చెప్పుల్లేకుండా ఎండలో నిలబెట్టడంపై సర్వత్రా అధికారులను విమర్శించారు.